HireVue announces acquisition of Modern Hire

Learn More

Candidates: Are you interviewing and need support?

వ్యక్తిగత డేటా సేకరించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి సమ్మతి మరియు/లేదా చట్టబద్ధమైన ఆధారం (Consent Telugu)

వ్యక్తిగత డేటా సేకరించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి సమ్మతి మరియు/లేదా చట్టబద్ధమైన ఆధారం

చివరిసారి అప్‌డేట్ చేసింది ఆగస్టు 2022

ఈ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్ (“Platform”) మా క్లయింట్‌లకు (అంటే ఉద్యోగ యజమానులు) (తేడా లేకుండా, “క్లయింట్” లేదా “ఉద్యోగ యజమాని”) మా “సర్వీసులు” లో భాగంగా అందించే ఉద్యోగ పూర్వ-ప్రక్రియలను పూర్తి చేయడాన్ని సులభం చేయడానికి Modern Hire Inc. (“Modern Hire“మేము” “మా”) ద్వారా ఆపరేట్ చేయబడుతున్నది. మా ప్లాట్‌ఫామ్ మరియు సర్వీసులలో, కానీ అంతవరకే పరిమితం కాకుండా, అభ్యర్థులు మరియు/లేదా ఉద్యోగార్థులను (ఇద్దరినీ కలిపి “అభ్యర్థి(లు)”) రిక్రూటర్లు, హైర్ చేసుకునే మేనేజర్లతో మరియు/లేదా తదుపరి ఇంటర్వ్యూ చేసేవారితో (అందరినీ కలిపి “రిక్రూటర్లు”) కనెక్ట్ చేయడం ద్వారా వారి కోసం ఉద్యోగ పూర్వ-మదింపులు, డిజిటల్/వర్చువల్ ఇంటర్వ్యూలు, షెడ్యూల్ చేయడం మరియు/లేదా ఇతర నియామకానికి ముందటి అనుభవాలు ఉంటాయి. మా ప్లాట్‌ఫారమ్ మరియు సేవలు ఉద్యోగ యజమాని ఉద్యోగ-పూర్వ ప్రక్రియలను సులభతరం చేస్తాయి, కానీ Modern Hire అభ్యర్థి ఇంటర్వ్యూ, మదింపు, మూల్యాంకనం, ఎంపిక లేదా నియామక ప్రక్రియలో పాల్గొనదు లేదా వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోదు. అభ్యర్థులు, రిక్రూటర్లు మరియు ఉద్యోగ యజమానులతో సహా ప్లాట్‌ఫామ్ మరియు సర్వీసులను యాక్సెస్ చేసే మరియు ఉపయోగించే వ్యక్తులను ఇక్కడ ఉమ్మడిగా “యూజర్లు” అని పేర్కొనవచ్చు.

 

అభ్యర్థులు మరియు రిక్రూటర్ల ఇద్దరి కోసం ఈ ప్లాట్‌ఫామ్ మరియు సర్వీసులను ఉపయోగించే సమయంలో ప్రోసెస్ చేయబడే ఏదైనా వ్యక్తిగత డేటా (కింద నిర్వచించినట్లు) కోసం బాధ్యతగల సంస్థ, సంబంధిత ఉద్యోగ పోస్టింగ్‌లో పేర్కొన్నట్లు ఉద్యోగ దరఖాస్తును అభ్యర్థులు సమర్పిన సంస్థ లేదా అభ్యర్థులు లేదా రిక్రూటర్లు ఎవరి ద్వారా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేశారో ఆ సంస్థ (అంటే, మా క్లయింట్/ఉద్యోగ యజమని మరియు “డేటా కంట్రోలర్“). మేము డేటా కంట్రోలర్ దిశలో “డేటా ప్రాసెసర్“గా వ్యక్తిగత డేటాను సేకరిస్తాము, ఉపయోగిస్తాము మరియు బదిలీ (సమిష్టిగా “ప్రాసెస్“) చేస్తాము.

 

మా గోప్యతా నోటీసు మరియు వర్తించే డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత డేటాను మేము ప్రాసెస్ చేస్తాము, ఉదాహరణకు, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (యూరోపియన్ యూనియన్‌లో ఉన్న వినియోగదారుల కోసం), ఆస్ట్రేలియన్ ప్రైవసీ యాక్ట్ (ఆస్ట్రేలియాలో ఉన్న వినియోగదారుల కోసం), కాలిఫోర్నియా కన్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ (కాలిఫోర్నియాలో ఉన్న వినియోగదారుల కోసం).  వర్తించే డేటా రక్షణ చట్టాల ప్రకారం మీకున్న నిర్దిష్ట హక్కుల వివరాలు మా గోప్యతా నోటీసు మరియు సంబంధిత దేశ-నిర్దిష్ట చట్ట అనుబంధంలో మరింతగా పేర్కోబడ్డాయి. వర్తించే డేటా రక్షణ చట్టాల ప్రకారం, మీరు వ్యక్తిగత డేటా నిర్దిష్ట ఉపయోగానికి సమ్మతించవలసి ఉంటుంది మరియు కొన్ని సందర్భాల్లో డేటా కంట్రోలర్ (అంటే, మా క్లయింట్) మరియు దాని డేటా ప్రాసెసర్ (అంటే., Modern Hire) స్పష్టమైన సమ్మతి లేకుండా మీ వ్యక్తిగత డేటా ఉపయోగించడానికి చట్టబద్ధమైన ఆధారాన్ని కలిగి ఉండవచ్చు.

 

ఈ ప్లాట్‌ఫామ్ మరియు సర్వీసులను ఉపయోగించేటప్పుడు, యూజర్‌గా మీరు అందించిన లేదా మీ నుండి సేకరించబడిన వ్యక్తిగత డేటా అంతా, ఇందులో డిజిటల్/వర్చువల్ ఇంటర్వ్యూలకు మీ జవాబులు మరియు/లేదా వీడియో మరియు/లేదా ఆడియో రికార్డింగ్‌లు, SMS టెక్స్ట్ సందేశాలు మరియు/లేదా ప్రశ్న ప్రతిస్పందనల ద్వారా సేకరించబడిన మదింపులుగా ఉండవచ్చు, ఇవి బహుళ ఎంపికగా లేదా టెక్స్ట్-ఆధారితంగా ఉండవచ్చు, ఉమ్మడిగా (ఉమ్మడిగా “వ్యక్తిగత డేటా”) మా డేటా నిలుపుదల పాలసీలు మరియు మా గోప్యతా నోటీస్‌తోపాటు ఏదైనా వర్తించే క్లయింట్ గోప్యతా పాలసీ ప్రకారం ప్రాసెస్ చేయబడుతుంది మరియు డిజిటల్‌గా స్టోర్ చేయబడుతుంది.

 

మీరు మా సర్వీస్‌ల ద్వారా మీరు అందించే ఏవైనా రికార్డింగ్‌లు (అంటే, వీడియో మరియు/లేదా ఆడియో) గుర్తింపు ప్రయోజనాల కోసం ఉపయోగించబడవని దయచేసి గమనించండి (అంటే, అవి డిజిటల్‌గా విశ్లేషించబడవు లేదా వాయిస్‌ప్రింట్‌లు లేదా ముఖ గుర్తింపు ఫైల్‌లుగా ప్రాసెస్ చేయబడవు). ఇంకో మాటలో చెప్పాలంటే, ప్లాట్‌ఫామ్ లేదా సర్వీసులు మీ ముఖ లక్షణాలను, ముఖ కవళికలను, కంటి కదలికలను లేదా గొంతు స్వరాన్ని గుర్తింపు కోసంతో సహా, ఏదైనా ఉద్దేశం కోసం విశ్లేషించవు, కాబట్టి Modern Hire ఈ రికార్డింగ్‌లను ఏవైనా బయోమెట్రిక్ సమాచార రక్షణ నిబంధనలలో నిర్వచించినట్లు లేదా వాటికి లోబడిన బయోమెట్రిక్ డేటాగా పరిగణించదు. సర్వీసులు అందించే ప్రయోజనాల కోసం రికార్ఢింగుల నుండి ముడి డేటాను టెక్స్ట్ ఫార్మాట్ లోకి మేము మార్చవచ్చు. డేటా కంట్రోలర్‌గా మా క్లయింట్ వ్యక్తిగత డేటాకు యాక్సెస్ కలిగి ఉంటారు.

 

వర్తించే డేటా రక్షణ చట్టాలతో మా సమ్మతిలో అటువంటి రికార్డింగ్‌ల ప్రాసెసింగ్‌కు సంబంధించి అవసరమైన సమ్మతి ఉంటుంది. ఈ రికార్డింగ్‌లు, బయోమెట్రిక్ చట్టాలు లేదా ఇతర వర్తించే డేటా రక్షణ చట్టాల (గుర్తింపు ప్రయోజనాల కోసం ఉపయోగించనప్పటికీ) పరిధిలోకి వచ్చినట్లు భావించాల్సిన సందర్భంలో, యూజర్‌గా మీరు ఈ క్రింది హక్కులను కలిగి ఉండవచ్చు: అలాంటి రికార్డింగ్‌లను మీ ప్రతిస్పందనలను ట్రాన్స్‌క్రైబ్ మరియు మూల్యాంకనం చేయడానికి అవసరమైన విధంగా సేకరించబడ్డాయి మరియు నిల్వ చేయబడ్డాయని; రికార్డింగ్‌లు మా సాధారణ డేటా నిలుపుదల పాలసీలకు అనుగుణంగా మరియు వర్తించే డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా అవసరమైన విధంగా తొలగించబడ్డాయని; మరియు వీడియో మరియు/లేదా ఆడియో రికార్డింగ్‌ల ద్వారా సేకరించడం ఉన్న మా ప్లాట్‌ఫామ్ లేదా సర్వీస్‌లను మీరు ఉపయోగించడం అనేది సేకరణకు సంబంధించిన సమాచారాన్ని పొందినట్లు మరియు ఇక్కడ వివరించిన విధంగా రికార్డింగ్‌లను ఉపయోగించినట్లు యూజర్‌గా మీ అంగీకారమని తెలుసుకునే హక్కు. మీరు అదనపు నిర్దిష్టతల కోసం మా గోప్యతా నోటీసు మరియు సంబంధిత దేశ-నిర్దిష్ట చట్ట అనుబంధాన్ని చూడవచ్చు (ఉదా., ఇల్లినాయిస్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ యాక్ట్).

 

మీ వ్యక్తిగత డేటాలో మీ మొదటి పేరు, చివరి పేరు, ఇ-మెయిల్ అడ్రసు మరియు/లేదా సెల్ ఫోను నంబరు వంటి డేటా ఉండవచ్చు. వర్తించే డేటా రక్షణ చట్టాలలో నిర్వచించినట్లుగా మా సేవలకు ఎటువంటి సున్నితమైన సమాచారం (ఉదా., తెగ, జాతి మూలం, రాజకీయ అభిప్రాయాలు, మత విశ్వాసాలు మొదలైనవి) అవసరం లేదు.  మేము సాధారణంగా ఒక యూజర్‌గా మీ నుండి నేరుగా వ్యక్తిగత డేటాను సేకరిస్తాము, ఇందులో సున్నితమైన డేటా ఉండవచ్చు, ఉదాహరణకు, వీడియో రికార్డింగ్ లింగం, జాతి లేదా జాతిని ఊహించగల సమాచారాన్ని ప్రతిబింబించవచ్చు, కానీ మేము మా సర్వీస్‌ల ప్రయోజనాల కోసం అలాంటి డేటాను ఉపయోగించము. మా క్లయింట్‌లకు మా సర్వీస్‌లు అందించడానికి అవసరమైన వ్యక్తిగత డేటాను మేము ప్రాసెస్ చేస్తాము. మీ వ్యక్తిగత డేటా (ఏదైనా సున్నితమైన డేటాతో సహా) సంబంధిత దేశ-నిర్దిష్ట చట్ట అనుబంధంతో సహా మా గోప్యతా నోటీసుకు అనుగుణంగా నిర్వహించబడుతుంది.

 

యూజర్‌గా మీకు ఏ డేటా రక్షణ చట్టాలు వర్తించవచ్చనే దానిపై ఆధారపడి (దయచేసి అదనపు వివరాల కోసం మా గోప్యతా నోటీసు మరియు సంబంధిత దేశ-నిర్దిష్ట చట్ట అనుబంధాన్ని చూడండి), సమాచారం కోసం అభ్యర్థనకు గానీ, మీ వ్యక్తిగత డేటాకు సంబంధించిన హక్కులు లేదా మరొక ప్రయోజనం కోసం మమ్మల్ని అనుమతించడానికి గానీ మాకు మీ ఇమెయిల్ అడ్రసు అందించడం అనేది, మీతో ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి, వర్తించే డేటా రక్షణ చట్టాల (కెనడా యాంటీ-స్పామ్ చట్టం వంటివి) ప్రకారం అవసరమైన చోట ఎంపిక ప్రాతిపదికన మీ ఎన్నికలను ఏర్పాటు చేస్తుంది. మా నుండి తదుపరి ఇమెయిల్ కమ్యూనికేషన్లు నిలిపివేయడాన్ని మీరు ఎప్పుడైనా ఎంచుకోవచ్చ.

 

మీ వ్యక్తిగత డేటాను మూల్యాంకనం చేయడానికి మేము కృత్రిమ మేధస్సు మరియు/లేదా ఆటోమేట్ చేయబడిన నిర్ణయం తీసుకోవడాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఉపయోగించినప్పుడు, ఆటోమేట్ చేయబడిన నిర్ణయం తీసుకోవడం మరియు/లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ప్రతిస్పందనల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోదు, బదులుగా ఒక స్కోర్ లేదా సిఫార్సు చేసిన స్కోర్‌ను అందిస్తుంది, దాన్ని మీ ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకోవడంలో మా క్లయింట్ నియామక బృందం ఉపయోగించవచ్చు. మా ప్లాట్‌ఫారమ్ మరియు సేవలు ఉద్యోగ యజమాని ఉద్యోగ-పూర్వ ప్రక్రియలను సులభతరం చేస్తాయి, కానీ Modern Hire అభ్యర్థి ఇంటర్వ్యూ, మదింపు, మూల్యాంకనం, ఎంపిక లేదా నియామక ప్రక్రియలో పాల్గొనదు లేదా వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం గురించి అదనపు వివరాలు “నియామక ప్రక్రియలో పక్షపాతాన్ని తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించబడుతుంది?” సమ్మతి పత్రంలో పేర్కొనబడుతుంది, అది అటువంటి నిర్ణయం తీసుకునే ప్రక్రియను ఉపయోగించే ప్లాట్‌ఫామ్ భాగానికి ముందు మీకు చూపబడుతుంది.

 

మా గోప్యతా నోటీసులో పేర్కొన్న విధంగా, మేము మా డేటా హోస్ట్ ప్రొవైడర్ (“DHP“)తో సహా నిర్దిష్ట మూడవ-పక్ష సేవా ప్రదాతలను ఉప-ప్రాసెసర్‌గా ఉపయోగిస్తాము. మా గోప్యతా నోటీసులో వివరించిన విధంగా మేము ఇతర మూడవ పక్ష సేవా ప్రదాతలకు కూడా వ్యక్తిగత డేటాను వెల్లడిస్తాము. మా DHP డేటా సెంటర్‌లు మరియు మా ఇతర మూడవ పక్ష సర్వీస్ ప్రొవైడర్లు మీరు నివసించే దేశంలో కాకుండా వేరే దేశంలో ఉండవచ్చు.  అలాంటి సందర్భాలలో, వర్తించే చట్టానికి (ఉదా., GDPR కింద ఉన్న EU స్టాండర్డ్ కాంట్రాక్టువల్ క్లాజస్ అనేవి అలా చేయడానికి ఒక మార్గం) అనుగుణంగా తగినంత స్థాయి డేటా రక్షణను ధ్రువపరచుకోవడానికి మా క్లయింట్ (అంటే., డేటా కంట్రోలర్) మరియు Modern Hire చర్యలు తీసుకుంటాయి.

 

మీ వ్యక్తిగత డేటాను ప్రోసెసింగ్‌కు మీ సమ్మతిని   ను సంప్రదించడం ద్వారా ఏ సమయంలోనైనా మీరు ఉపసంహరించుకోవచ్చు. సమ్మతి రద్దు చేసుకోవడానికి అభ్యర్థన అందుకున్న తర్వాత, మేము వెంటనే డేటా కంట్రోలర్‌ను సంప్రదిస్తాము మరియు డేటా కంట్రోలర్ ఆమోదిస్తే, చట్టం ప్రకారం లేదా మా ప్రామాణిక డేటా నిలుపుదల పాలసీలలో పేర్కొన్న విధంగా మా రికార్డు నిలుపుదల పాలసీ అవసరాల ప్రకారం నిలుపుదల అవసరమైతే తప్ప, మేము అభ్యర్థించినట్లు మీ వ్యక్తిగత డేటాను తొలగిస్తాము. మేము మీ వ్యక్తిగత డేటాను తొలగించలేకపోతే, Modern Hire గానీ లేదా డేటా కంట్రోలర్ గానీ ఈ నిలుపుదలకు కారణాలను యూజర్‌గా మీకు తెలియజేస్తారు.

 

మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి మీరు సమ్మతించకుంటే లేదా మీ సమ్మతిని ఉపసంహరించుకోకుంటే, మీరు ప్లాట్‌ఫామ్ పూర్తి ఉపయోగం మరియు/లేదా మా సర్వీసుల పూర్తి ప్రయోజనం పొందలేరు. మా గోప్యతా నోటీసులో, యూజర్‌గా మీరు ఎలా యాక్సెస్‌ని అభ్యర్థించవచ్చు మరియు మీ డేటాను ఎలా సరిదిద్దవచ్చు, వర్తించే డేటా రక్షణ చట్టాల ఉల్లంఘన గురించి యూజర్‌లు ఎలా ఫిర్యాదు చేయవచ్చు మరియు మేము (లేదా డేటా కంట్రోలర్‌గా మా క్లయింట్) అలాంటి ఫిర్యాదుతో ఎలా వ్యవహరిస్తాము అనే వాటిని గురించి సమాచారం ఉంటుంది. వర్తించే డేటా రక్షణ చట్టాల కింద యూజర్‌గా మీకున్న అదనపు వ్యక్తిగత హక్కుల వివరాలు మా గోప్యతా నోటీసు మరియు సంబంధిత దేశ-నిర్దిష్ట చట్ట అనుబంధంలో కూడా వివరించబడ్డాయి. ఈ సమ్మతికి సంబంధించి ఏవైనా ఇతర ప్రశ్నల కోసం మీరు   లో మమ్మల్ని సంప్రదించవచ్చు.

 

మీ వ్యక్తిగత డేటాకు సాధ్యమైన అత్యున్నత రక్షణ సునిశ్చితం చేయడానికి మేము ముందు జాగ్రత్తలు తీసుకుంటాము. మా సర్వీస్‌లను అందించే సందర్భంలో మేము ప్రాసెస్ చేసే వ్యక్తిగత డేటా అంతా అనధికారిక యాక్సెస్ మరియు తారుమారు చేయబడటం నుండి తగిన సాంకేతిక మరియు సంస్థాగత చర్యల ద్వారా మరియు వర్తించే డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా రక్షించబడుతుంది.

 

కింద అంగీకరించు క్లిక్ చేయడం ద్వారా మీరు అంగీకరిస్తారు: పరిమితి లేకుండా సున్నితమైన డేటాతో సహా నా వ్యక్తిగత డేటా ప్రాసెస్ చేయడానికి లేదా రికార్డింగ్‌లు ఉపయోగించడం, కృత్రిమ మేధస్సు లేదా ఆటోమేట్ చేయబడిన నిర్ణయం తీసుకోవడాన్ని ఉపయోగించడం మరియు నేను నా ఇమెయిల్‌ను అందిస్తే ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా ఒక యూజర్‌గా నాతో కమ్యూనికేట్ చేసే హక్కుతో సహా నా వ్యక్తిగత డేటాను Modern Hire ప్రాసెస్ చేయడానికి, ప్రతి ఒక్కటి పైన వివరించిన ప్రయోజనాల కోసం మరియు Modern Hire గోప్యతా నోటీసు మరియు యూజర్‌గా నా కోసం సంబంధిత దేశ-నిర్దిష్ట చట్ట అనుబంధంలో పేర్కొనబడినట్లుగా, Modern Hire ప్లాట్‌ఫారమ్ మరియు సేవలను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి నేను సమ్మతిస్తున్నాను.