Candidates: Are you interviewing and need support?
వాడకం నిబంధనలు (TOUs Telugu)
వాడకం నిబంధనలు
చివరిసారి అప్‌డేట్ చేసింది ఆగస్టు 2022
పరిచయం
Modern Hire, Inc. మరియు దాని అనుబంధ సంస్థలు (ఇకపై “Modern Hire“, “మేము” లేదా “మా“) ఈ వెబ్‌సైట్ మరియు Modern Hire అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌ను (ఉమ్మడిగా ఇందులో “సైట్” అని పేర్కొనబడుతుంది) నిర్వహిస్తాయి మరియు సైట్ ద్వారా సర్వీస్‌లను (“సర్వీస్‌లు“) అందిస్తాయి. మా సైట్ మరియు సర్వీసులలో, కానీ అంతవరకే పరిమితం కాకుండా, అభ్యర్థులు మరియు/లేదా ఉద్యోగార్థులను (ఉమ్మడిగా “అభ్యర్థులు“) రిక్రూటర్లు, నియామకం చేసుకునే మేనేజర్లతో మరియు/లేదా తదుపరి ఇంటర్వ్యూ చేసేవారితో (ఉమ్మడిగా “రిక్రూటర్లు”) కనెక్ట్ చేయడం ద్వారా మా క్లయింట్‌లకు (అంటే., ఉద్యోగ యజమానులు) (తేడా లేకుండా, “క్లయింట్” లేదా “ఉద్యోగ యజమాని“) అందించే ఉద్యోగ పూర్వ-మదింపులు, డిజిటల్/వర్చువల్ ఇంటర్వ్యూలు, షెడ్యూల్ చేయడం మరియు/లేదా ఇతర నియామకానికి ముందటి అనుభవాలు ఉంటాయి. మా సైట్ మరియు సర్వీస్‌లు ఉద్యోగ యజమాని ఉద్యోగ-పూర్వ ప్రక్రియలను సులభతరం చేస్తాయి, కానీ Modern Hire ఇంటర్వ్యూ, మదింపు, మూల్యాంకనం, ఎంపిక లేదా నియామక ప్రక్రియలో పాల్గొనదు లేదా వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోదు.
ఈ వాడకం నిబంధనలు అభ్యర్థులు, రిక్రూటర్‌లు మరియు ఉద్యోగ యజమానుల (ఇక్కడ సమిష్టిగా “యూజర్‌లు” లేదా “మీరు” అని పేర్కొంటారు) ద్వారా సైట్ మరియు సర్వీస్‌ల యాక్సెస్‌ను నియంత్రించే నిబంధనలు మరియు షరతులను నిర్దేశించారు. సైట్ మరియు/లేదా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ఈ వాడకం నిబంధనలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను అలాగే మా గోప్యతా నోటీసు (క్రింద లింక్ చేయబడింది) (సమిష్టిగా, “నిబంధనలు”)లో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను అంగీకరిస్తున్నారు. మీరు నిబంధనలలోని ఏదైనా భాగంతో విభేదిస్తే, మీరు సైట్ లేదా సర్వీస్‌లను తప్పక యాక్సెస్ చేయకూడదు లేదా ఉపయోగించకూడదు. నిబంధనలను ఎప్పటికప్పుడు సవరించే హక్కు మాకు ఉంది మరియు అటువంటి మార్పుల కోసం మీరు కాలానుగుణంగా నిబంధనలను సమీక్షించాలి. సవరించిన నిబంధనల ప్రచురణ తేదీ నుండి సైట్ మరియు సర్వీస్‌లను ఉపయోగించడానికి సవరించిన నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలకు అదనంగా నిర్దిష్ట సేవల కోసం అదనపు సేవా నిబంధనలు ఉండవచ్చు, అలా అయితే, అవి ఆ సర్వీస్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి మరియు ఈ నిబంధనలకు అదనంగా ఉంటాయి మరియు ఈ నిబంధనల పరిమితిలో ఉండవు. ఒక నిర్దిష్ట సర్వీస్‌కు అదనపు నిబంధనలు వర్తిస్తే, సర్వీస్‌లోని ఆ అదనపు నిబంధనల గురించి మీకు స్పష్టంగా తెలియజేయబడుతుంది.
అంగీకారయోగ్యమైన వాడకం
మీరు సైట్ లేదా సర్వీస్‌ల లభ్యత లేదా యాక్సెసిబిలిటీని దెబ్బతీసే లేదా దెబ్బతీయవచ్చనే లేదా అశక్తత కలిగించే విధంగా లేదా చట్టవిరుద్ధమైన, అక్రమమైన, మోసపూరితమైన లేదా హానికరమైన లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన, అక్రమమైన, మోసపూరితమైన లేదా హానికరమైన ప్రయోజనం లేదా కార్యాచరణకు సంబంధించిన ఏ విధానంలోనూ సైట్ లేదా సర్వీస్‌లను ఉపయోగించకూడదు.
మీరు ఏదైనా స్పైవేర్, కంప్యూటర్ వైరస్, ట్రోజన్ హార్స్, వర్మ్, కీస్ట్రోక్ లాగర్ లేదా ఇతర హానికరమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఉండే (లేదా లింక్ చేయబడిన) ఏదైనా మెటీరియల్‌ని కాపీ చేయడానికి, నిల్వ చేయడానికి, హోస్ట్ చేయడానికి, ప్రసారం చేయడానికి, పంపడానికి, ఉపయోగించడానికి, ప్రచురించడానికి లేదా పంపిణీ చేయడానికి సైట్ లేదా సర్వీస్‌లను ఉపయోగించకూడదు.
ఆన్‌లైన్ డిజిటల్/వర్చువల్ ఇంటర్వ్యూ, ఉద్యోగ-పూర్వ మదింపు, జాబ్ సిములేషన్ లేదా ఇతర నియామకం పూర్వ అనుభవాన్ని పూర్తి చేయడం కోసం మీరు సర్వీస్‌లు యాక్సెస్ చేయవచ్చు. అనుభవాన్ని పూర్తి చేయమని మిమ్మల్ని కోరిన ఉద్యోగ యజమాని మీకు సర్వీస్‌లకు యాక్సెస్‌ను అందించవచ్చు.
మీ బాధ్యతలు
మీ లాగిన్ ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మీ ఖాతాని (అంటే, మీ లాగిన్ ID మరియు పాస్‌వర్డ్) ఉపయోగించి చేసిన వాడకంతో సహా, అది మీరు చేసినా లేదా మీ లాగిన్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి మరెవరైనా చేసినా, మీ సైట్ మరియు/లేదా సర్వీస్‌ల వాడకానికి మీరే బాధ్యత వహిస్తారు. మీ లాగిన్ ID మరియు పాస్‌వర్డ్‌ను అనధికార వాడకం నుండి రక్షించడానికి మరియు భద్రపరచడానికి మీరే బాధ్యత వహిస్తారు. మీ లాగిన్ ID లేదా పాస్‌వర్డ్‌కు భద్రతా ఉల్లంఘన జరిగిందని మీరు విశ్వసిస్తే, మీరు తప్పక వెంటనే మాకు తెలియజేయాలి. మీరు మాకు ఇండెమ్నిఫై (ఈ నిబంధనలో – మా అనుబంధ సంస్థలు, అధికారులు, డైరెక్టర్‌లు, ఉద్యోగులు, సలహాదారులు, ఏజెంట్లు, క్లయింట్లు, లైసెన్సర్‌లు మరియు వారి సంబంధిత వారసులు మరియు అసైన్‌లతో సహా) చేయాలి మరియు ఈ నిబంధనలను పాటించడంలో మీ వైఫల్యం లేదా మీ వినియోగదారు ఖాతాను ఏదైనా అనధికారికంగా ఉపయోగించడం వల్ల ఉత్పన్నమైన సహేతుకమైన న్యాయవాదుల రుసుముతో సహా, ఏదైనా క్లెయిమ్, దెబ్బతినడం, నష్టం, బాధ్యత లేదా ఖర్చుతో సహా మాకు హాని కలిగించకుండా ఉంచాలి. మీరు ఏ విధంగానైనా లేదా ఏ మార్గంలోనైనా, అటువంటి యాక్సెస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మరియు/లేదా వాడటంతో సహా (మీ ప్రతిస్పందనలతో సహా, కానీ అంతవరకే పరిమితం కాకుండా), కానీ అంతవరకే పరిమితం కాకుండా, సైట్ లేదా సర్వీస్‌ల మీ యాక్సెస్ లేదా వాడకాన్ని తిరిగి ప్రసారం చేయకూడదు లేదా పునఃపంపిణీ చేయకూడదు. మీరు ఎలాంటి బెదిరింపు, అశ్లీల, అవమానకరమైన, చట్టవిరుద్ధమైన లేదా మరోరకంగా అభ్యంతరకరమైన విషయాలను పోస్ట్ చేయకూడదు లేదా ప్రసారం చేయకూడదు. ఏదైనా అనాయాచిత కమ్యూనికేషన్ (ఉదా. స్పామ్) పంపడానికి మీరు మీ యూజర్ ఖాతాను ఉపయోగించకూడదు. మా ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఏదైనా ఇతర వెబ్‌సైట్ లేదా ఆఫ్-సైట్ వెబ్ పేజీలకు ఈ సైట్ మరియు/లేదా సర్వీస్‌లను లింక్ చేయడానికి మీకు అనుమతి లేదు.
సైట్ ఉపయోగించడానికి లైసెన్స్; మేధో సంపత్తి
మరోలా పేర్కొనకపోతే, Modern Hire మరియు/లేదా దాని లైసెన్సర్‌లు సైట్‌లో మరియు సైట్‌కు మరియు సర్వీస్‌లు మరియు సైట్ లేదా సర్వీస్‌ల లోని మరియు వాటి నుండి ఉత్పన్నమైన సామగ్రి అంతటిపై మేధో సంపత్తి హక్కులను కలిగి ఉంటారు. ఈ నిబంధనలలో స్పష్టంగా అనుమతించబడినట్లు తప్ప, సైట్ మరియు సర్వీస్‌లలోని అన్ని మేధో సంపత్తి హక్కులు Modern Hire కు రిజర్వ్ చేయబడ్డాయి.
ఈ నిబంధనలకు లోబడి, సైట్ మరియు ఒక ఖాతా ఏర్పాటు చేయబడిన మరియు ఆమోదించబడిన సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి మేము మీకు ప్రత్యేకించబడని, బదిలీ చేయలేని, పరిమిత హక్కును మంజూరు చేస్తాము. సందేహాన్ని నివారణ కోసం, మా సర్వీస్‌లు ఉపయోగించని లేదా మా సైట్‌లో ఖాతాను ఏర్పాటు చేసుకోని మా సైట్‌ను సందర్శించే సాధారణ సందర్శకులు పైన పేర్కొన్న లైసెన్స్ హక్కులను పొందలేరు. సైట్ మరియు సర్వీస్‌ల నిబంధనకు సంబంధించి, Modern Hire వివిధ సామర్థ్యాలు మరియు సాంకేతికతలను అమలు చేస్తుంది, వీటిలో అంతవరకే పరిమితం కాకుండా, కఠినంగా అభివృద్ధి చేయబడిన మరియు పరీక్షించబడిన సైన్స్, యాజమాన్య పద్ధతులు, అల్గారిథమ్‌లు, కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ మరియు సారూప్య ప్రక్రియలు ఉన్నాయి, ఇవన్నీ Modern Hire యొక్క మేధో సంపత్తి హక్కులుగా రక్షించబడతాయి.
మీరు సైట్ నుండి పొందిన లేదా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా పొందిన సామగ్రిని పునరుత్పత్తి, నకలు, కాపీ, పునఃప్రచురణ, విక్రయం, లీజుకు ఇవ్వడం లేదా సబ్‌లైసెన్స్ ఇవ్వడం చేయకూడదు లేదా సైట్‌లోని మరియు సర్వీస్‌లను యాక్సెస్ చేయడం మరియు ఉపయోగించడం ద్వారా పొందిన ఏదైనా సామగ్రిని ఎడిట్ చేయడం లేదా సవరించడం చేయకూడదు. ఈ నిబంధనలో మీకు మంజూరు చేయబడిన హక్కులను మీరు సబ్-లైసెన్స్ చేయకూడదు, కేటాయించకూడదు లేదా బదిలీ చేయకూడదు. సైట్ లేదా సర్వీస్‌లలో మీకు ఏ ఇతర హక్కు, శీర్షిక లేదా ప్రయోజనం మంజూరు చేయబడలేదు.
గోప్యత మరియు భద్రత
మా గోప్యతా నోటీసు, మేము మీ నుండి సేకరించిన లేదా మీరు మాకు అందించే లేదా మా సర్వీస్‌లను అందించడానికి మేము ఉపయోగించే ఏదైనా వ్యక్తిగతంగా గుర్తించదగిన డేటా (“వ్యక్తిగత డేటా“) సేకరించినప్పుడు, ఉపయోగించినప్పుడు మరియు/లేదా బదిలీ చేసినప్పుడు (“ప్రాసెస్“) మా బాధ్యతలను స్పష్టం చేస్తుంది. సైట్ లేదా సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా మరియు వర్తించే చట్టం అధికారం ఇచ్చిన మేరకు, మీరు మీ వ్యక్తిగత డేటాను అలా ప్రాసెస్ చేయడానికి సమ్మతిస్తారు. మీరు మా సైట్ లేదా సర్వీస్‌ల ద్వారా మాకు అందించే ఏవైనా ఖచ్చితం కాని డేటాకు మేము బాధ్యులం కాదని మీరు గుర్తిస్తున్నారు మరియు అంగీకరిస్తున్నారు. సైట్ మరియు/లేదా సర్వీస్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, వర్తించే డేటా రక్షణ నిబంధనలకు (ఉదా., యూరోపియన్ యూనియన్ నివాసితుల కోసం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)) అనుగుణంగా మా ప్రాసెసింగ్‌కు సమ్మతించమని మిమ్మల్ని అడగవచ్చు. మీరు సైట్ ద్వారా సమర్పించే ఏదైనా సమాచారం, సామగ్రి లేదా ఆలోచన (మీ ఖాతా క్రెడెన్షియల్స్ కాకుండా) గోప్యమైనది మరియు యాజమాన్యం క్రిందికి రానిదిగా పరిగణించబడుతుంది. మా గోప్యతా నోటీసును ఇక్కడ చూడవచ్చు: .
వారంటీ నిరాకరణ ప్రకటన
మేము సైట్ మరియు సర్వీస్‌లలో ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, మేము లేదా మా క్లయింట్లు, ఉద్యోగులు, లేదా మా అనుబంధ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లు, సరఫరాదారులు లేదా వారి ఉద్యోగులు ఎవరూ ఎలాంటి వారెంటీని స్పష్టంగా గానీ లేదా సూచనాత్మకంగా గానీ ఇవ్వరు లేదా సైట్‌లో లేదా మా సర్వీస్‌లలో ఏదైనా సమాచారపు సమయపాలన లేదా సంపూర్ణతకు ఏదైనా చట్టపరమైన జవాబుదారీతనం (చట్టం ద్వారా అనుమతించబడిన మేరకు) లేదా బాధ్యత వహించరు మరియు తదుపరి మీ సైట్ లేదా సర్వీస్‌ల వాడకం నుండి పొందే ఫలితాలకు సంబంధించి ఎటువంటి వారంటీని స్పష్టంగా గానీ లేదా సూచనాత్మకంగా గానీ ఇవ్వరు లేదా చట్టపరమైన జవాబుదారీతనం (చట్టం ద్వారా అనుమతించబడిన మేరకు) వహించరు. సిస్టమ్ వైఫల్యం, నిర్వహణ, మరమ్మత్తు లేదా మా నియంత్రణ పరిధిలో లేని కారణాల వల్ల సైట్ మరియు/లేదా సర్వీస్‌ల యాక్సెస్ తాత్కాలికంగా మరియు నోటీసు లేకుండా నిలిపివేయబడవచ్చు.
సైట్ మరియు సైట్‌లో అందుబాటులో ఉండే అన్ని సామగ్రులు మరియు సర్వీస్‌లు “ఉన్నవి ఉన్నట్లుగా” మరియు “అందుబాటులో ఉన్నట్లు” ఆధారంగా MODERN HIRE ద్వారా అందించబడతాయి. వర్తించే చట్టం ద్వారా అనుమతించబడిన పూర్తి స్థాయి మేరకు, మేము స్పష్టమైన లేదా సూచనాత్మక వారెంటీలన్నింటినీ నిరాకరిస్తాము, అంతవరకే పరిమితం కాకుండా, వర్తకపరమైన, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఫిట్‌నెస్, సంతృప్తికరమైన నాణ్యతకు సంబంధించిన సూచనాత్మక వర్తక వారెంటీలు లేదా భద్రత, ఖచ్చితత్వం మరియు ఉల్లంఘన లేకపోవడానికి సంబంధించిన ఏదైనా వారంటీ మరియు మీకు, మాకు మధ్య వ్యవహారం నడిచే క్రమం నుండి లేదా వాణిజ్య వినియోగం నుండి ఉత్పన్నం కావచ్చనే ఇతర అన్ని వారెంటీలతో సహా.
సైట్, సర్వీస్‌లు లేదా సైట్ లేదా సర్వీస్‌లలో ఉన్న ఏదైనా ఫంక్షన్ నిరంతరాయంగా లేదా లోపరహితంగా ఉంటాయని, ఆ లోపాలు సరిదిద్దబడతాయని లేదా సైట్ లేదా సర్వీస్‌లలో వైరస్‌లు లేదా ఇతర హానికరమైన భాగాలు లేకుండా ఉంటాయని MODERN HIRE లేదా మా క్లయింట్లు, సర్వీసు ప్రొవైడర్లు లేదా సరఫరాదారులు వారెంటీ ఇవ్వరు.
ఈ సైట్‌లో ప్రస్తావించబడిన అన్ని ఉత్పత్తులు లేదా సర్వీస్‌లు అందరు వ్యక్తులకు లేదా అన్ని భౌగోళిక ప్రదేశాల్లో అందుబాటులో ఉండవు. ఏవరైనా వ్యక్తి లేదా భౌగోళిక ప్రదేశానికి ఏదైనా ఉత్పత్తి లేదా సర్వీస్ వినియోగాన్ని మా సొంత విచక్షణతో పరిమితం చేసే హక్కును మేము కలిగి ఉన్నాము. మా సిబ్బంది నుండి లేదా ఈ సైట్ లేదా సర్వీస్‌ల ద్వారా మీరు పొందే ఎలాంటి సలహాలు లేదా సమాచారం ఈ నిబంధనలలో ప్రత్యేకంగా అందించబడని ఏ వారెంటీని సృష్టించదు.
బాధ్యత పరిమితి
చట్టం ద్వారా అనుమతించబడిన పూర్తి స్థాయి మేరకు, MODERN HIRE లేదా మా క్లయింట్లు, సర్వీస్ ప్రొవైడర్లు లేదా సరఫరాదారులు ఏదైనా పరోక్ష, సంఘటనాత్మక, ప్రత్యేక, పరిణామాత్మక, ఉదాహరణాత్మక, శిక్షాత్మక లేదా ఏవైనా ఇతర నష్టాలకు బాధ్యత వహించరు, ఇందులో పరిమితం కాదు లాభాలు, గుడ్‌విల్, వాడకం, డేటా లేదా ఇతర అసంగతమైన నష్టాలు (అటువంటి నష్టాల సంభావ్యత గురించి మాకు సలహా ఇవ్వబడినప్పటికీ), సైట్ సర్వీస్‌లను వాడటం లేదా వాడలేకపోవడం వల్ల ఉత్పన్నమయ్యే లేదా దాని ఫలితంగా లేదా (సైట్ లేదా సర్వీస్‌లకు లింక్ చేయబడిన ఏదైనా వెబ్‌సైట్ లోని కంటెంట్ లేదా ఇతర మెటీరియల్‌తో సహా), సర్వీస్‌ల పనితీరు లేదా వాడకం, అలాగే అనధికారిక యాక్సెస్ లేదా అనధికార అనుమతి లేదా మీ ట్రాన్స్‌మిషన్స్ లేదా డేటాలో మార్పు చేయడం ఉంటాయి.
అన్ని దెబ్బతినడాలు మరియు నష్టాలకు మీకు మా మొత్తం బాధ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిమ్‌కు సరిగ్గా ముందటి నెలలో మీరు మాకు చెల్లించిన మొత్తాన్ని మించదు. మీరు సైట్, సర్వీస్‌లు లేదా ఈ నిబంధనలలో దేనితోనైనా సంతృప్తి చెందకపోతే, మీ ఏకైక మరియు ప్రత్యేకమైన పరిష్కారం మీరు సైట్ లేదా సర్వీస్ వాడకాన్ని నిలిపివేయడమే.
ఈ నిబంధనలు మరియు షరతుల ఉల్లంఘనలు
ఈ నిబంధనల ప్రకారం మా ఇతర హక్కుల గురించి ప్రతికూలాభిప్రాయం లేకుండా, మీరు ఏ రకంగానైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, మీ సైట్‌కు యాక్సెస్ నిలిపివేయడం మరియు/లేదా మీ సర్వీస్‌లను ఉపయోగించడం, సైట్ మరియు/లేదా సర్వీస్‌లను యాక్సెస్ చేయకుండా మిమ్మల్ని నిషేధించడం, సైట్ మరియు/లేదా సర్వీస్‌లను యాక్సెస్ చేయకుండా మీ IP చిరునామాను ఉపయోగించి కంప్యూటర్‌లను బ్లాక్ చేయడం మరియు/లేదా మీపై కోర్టు విచారణలను తీసుకురావడంతో సహా ఆ ఉల్లంఘనను ఎదుర్కోవడానికి మేము సముచితంగా భావించే చర్యను తీసుకోవచ్చు.
లింక్‌లు
సైట్ లేదా సర్వీస్‌లు మూడవ పక్షం వెబ్‌సైట్‌లకు లింక్‌లను కలిగి ఉండవచ్చు. ఈ లింక్‌లు మీకు సౌలభ్యం కోసం మాత్రమే ఇవ్వబడ్డాయి మరియు అటువంటి మూడవ పక్షం వెబ్‌సైట్‌లలోని కంటెంట్‌కు Modern Hire ఆమోదం కోసం కాదు. లింక్ చేయబడిన మూడవ పక్షం వెబ్‌సైట్‌ల కంటెంట్‌కు Modern Hire బాధ్యత వహించదు మరియు అటువంటి మూడవ పక్షం వెబ్‌సైట్‌లలోని కంటెంట్ లేదా సామగ్రుల ఖచ్చితత్వానికి సంబంధించి ఎటువంటి ప్రాతినిధ్యాలను చేయదు. మీరు లింక్ చేయబడిన మూడవ పక్షం వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేస్తే, మీరు మీ సొంత పూచీతో మరియు అటువంటి మూడవ పక్షం వెబ్‌సైట్‌ల ప్రస్తుత నిబంధనలు మరియు షరతులకు అనుగుణంగా అలా చేస్తారు.
పాలక చట్టం మరియు అధికార పరిధి
ఈ నిబంధనలు చట్ట నియమాల వైరుధ్యాలతో సంబంధం లేకుండా U.S.A. లోని ఒహియో రాష్ట్ర చట్టాల ద్వారా నిర్వహించబడతాయి మరియు అన్వయించబడతాయి మరియు అమలు చేయబడతాయి. మీరు ఒహియోలోని (నార్తర్న్ డిస్ట్రిక్ట్) క్లీవ్‌ల్యాండ్ లో ఉన్న స్టేట్ మరియు/లేదా ఫెడరల్ కోర్టుల ప్రత్యేక అధికార పరిధి మరియు స్థలానికి బేషరతుగా మరియు తిరిగి వెనక్కు తీసుకోలేని విధంగా ఇందుమూలంగా అంగీకరిస్తున్నారు. సైట్‌ను యాక్సెస్ చేయడం మరియు ఉపయోగించడం ద్వారా మరియు సైట్ అందించే సర్వీస్‌లకు బదులుగా, ఈ నిబంధనలకు లోబడి మా సైట్ మరియు సర్వీస్‌లకు మీకు Modern Hire యాక్సెస్‌ను అందిస్తుందని మీరు అంగీకరిస్తున్నారు. సైట్ మరియు సర్వీస్‌ల మీ యాక్సెస్ మరియు ఉపయోగానికి సంబంధించిన పాక్షిక పరిగణనగా, మీరు క్లాస్ ప్లెయిన్‌టిఫ్ లేదా క్లాస్ ప్రతినిధిగా Modern Hire పై దావా వేయరని, సైట్ లేదా సర్వీస్‌ల యాక్సెస్ లేదా ఉపయోగానికి సంబంధించి Modern Hire కు వ్యతిరేకంగా దావాలో క్లాస్ మెంబర్‌గా చేరరని లేదా క్లాస్-యాక్షన్‌లో ఏ విధంగానైనా ప్రతికూల పార్టీగా పాల్గొనరని మీరు అంగీకరిస్తున్నారు. అంతేకాకుండా, అభ్యర్థి హోదాలో సైట్ మరియు సర్వీస్‌లకు మీ యాక్సెస్ మరియు ఉపయోగానికి ఎటువంటి ఛార్జీలు చెల్లించరు మరియు ఈ సైట్ మరియు సర్వీస్‌లు యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి మీరు చెల్లిస్తున్న ధరలో కొంత క్లాస్ యాక్సెస్ మినహాయింపుతో సహా ఈ నిబంధనలకు మీ అంగీకారం అని మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఈ నిబంధనలలోని ఏదైనా భాగాన్ని అంగీకరించకపోతే, సైట్ లేదా సర్వీస్‌లను యాక్సెస్ చేయవద్దు లేదా ఉపయోగించవద్దు (లేదా మీ యాక్సెస్ లేదా ఉపయోగించడానికి కొనసాగించకండి). అయితే, ఈ పేరాలోనిది ఏదీ పైన పేర్కొన్న ఫోరమ్ అవసరాలకు లోబడి, చిన్న క్లెయిమ్‌ల కోర్టులో సహా, వ్యక్తిగత వాదిగా దావా వేయడానికి మీ హక్కులను పరిమితం చేయదు.
సంప్రదింపు సమాచారం
సాంకేతిక మద్దతుకు సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ Modern Hire కు రెఫర్ చేయవచ్చు:
support@modernhire.com
సాంకేతిక మద్దతుకు సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ Modern Hire కు రెఫర్ చేయవచ్చు:
Modern Hire, Inc.
3201 Enterprise Parkway, Suite 460
Cleveland, Ohio 44122
ఫోను: 800.451.1695
ఇమెయిల్: legal@modernhire.com