HireVue announces acquisition of Modern Hire

Learn More

Candidates: Are you interviewing and need support?

గో ప్యతా నోటీసు (Privacy Telugu)

గో ప్యతా నోటీసు

చివరిసారి అప్‌డేట్ చేసింది ఆగస్టు 2022

 

మేము ఎవరు

వ్యక్తిగత డేటా సేకరించడం మరియు ప్రాసెస్ చేయడం

ప్రోసెసర్‌గా Modern Hire

కంట్రోలర్‌గా Modern Hire

మూడవ పక్షాలు

ప్రాసెసింగ్ ఉద్దేశం మరియు చట్టపరమైన ఆధారం

మా చట్టబద్ధమైన ప్రయోజనాలపై ఆధారపడటం

మీ సమ్మతిపై ఆధారపడటం

మీ సమ్మతిని ఉపసంహరించుకోవడం; డైరెక్ట్ మార్కెటింగ్‌కి అభ్యంతరం చేయడం

సమాచారం వెల్లడించడం మరియు పంచుకోవడం

సమాచారం నిలుపుదల

మీ హక్కులు

డేటా భద్రత

కుకీలు; బీకాన్స్; ట్రాకింగ్ టెక్నాలజీ

అదనపు చట్టాలు; మార్పులు

పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ నియమం (“COPPA”)

మార్పులు

మీ వ్యక్తిగత డేటా బదిలీ

దేశం నిర్దిష్ట చట్ట అనుబంధం

యునైటెడ్ స్టేట్స్ అనుబంధం

ఇల్లినాయిస్ నివాసితుల కోసం

కాలిఫోర్నియా నివాసితుల కోసం

EU/EEA అనుబంధం

యునైటెడ్ కింగ్‌డమ్ అనుబంధం

కెనడా అనుబంధం

ఆస్ట్రేలియా అనుబంధం

మలేషియా అనుబంధం

సింగపూర్ అనుబంధం

సంప్రదింపు సమాచారం

Modern Hire, Inc.

అనుబంధ సంస్థలు మరియు సంప్రదింపు సమాచారం

మేము ఎవరు

Modern Hire కు స్వాగతం. మీ గోప్యాన్ని రక్షించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ గోప్యతా నోటీసు (“నోటీసు”) పైన పేర్కొన్న తేదీ నుండి అమలులో ఉంటుంది మరియు మా వెబ్‌సైట్ మరియు మా అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌కు (ఈ నోటీసులో మా వెబ్‌సైట్ మరియు మా అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌లు ఉమ్మడిగా “సర్వీస్‌లు” గా పేర్కొనబడతాయి) సంబంధించి మా డేటా సేకరణ మరియు వెల్లడి పద్ధతులను వివరిస్తుంది. Modern Hire Inc., మరియు దాని అనుబంధ సంస్థలు (“Modern Hire,” “మేము,” “మాకు,” and “మా”) మా క్లయింట్లు, ఉద్యోగ యజమానులు (“ఉద్యోగ యజమానులు” లేదా “క్లయింట్లు”) తరపున పనిచేస్తూ, ఉద్యోగ దరఖాస్తుదారులు, అభ్యర్థులు మరియు/లేదా ఉద్యోగార్థులను (“అభ్యర్థి(లు)”) రిక్రూటర్‌లు, నియామక మేనేజర్లు మరియు/లేదా తదుపరి ఇంటర్వ్యూ చేసేవారితో (“రిక్రూటర్(లు)”) అనుసంధానించే ముందస్తు ఉపాధి ప్రక్రియలను పూర్తి చేసే సర్వీస్‌లు అందిస్తాయి. Modern Hire ప్రధాన సర్వీస్‌లు క్లౌడ్-ఆధారిత అప్లికేషన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందించబడతాయి, దీని ద్వారా రిక్రూటర్‌లు మరియు అభ్యర్థులు ఇతర ఫీచర్‌లతో పాటు డిజిటల్/వర్చువల్ ఇంటర్వ్యూ, షెడ్యూలింగ్ మరియు ఉద్యోగ-పూర్వ మదింపుల కోసం మా ప్రీ-హైర్ సొల్యూషన్‌లను ఉపయోగించుకోవచ్చు.

మా సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నోటీసును చదివి అర్థం చేసుకున్నారని సూచిస్తారు. వర్తించే చట్టం ప్రకారం అవసరమైన మేరకు మరియు మీరు నిలిపివేస్తే తప్ప, ఈ నోటీసుకు అనుగుణంగా మీ వ్యక్తిగత డేటాను సేకరించడం, స్వీకరించడం, నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం మరియు బదిలీ చేయడం (సమిష్టిగా “ప్రాసెసింగ్” లేదా “ప్రాసెస్”) చేయడంలో మీరు మాకు మీ సమ్మతిని అందిస్తారు.

Modern Hire సర్వీస్‌లు ఉద్యోగ యజమాని ఉద్యోగ-పూర్వ ప్రక్రియలను సులభతరం చేస్తాయి, కానీ Modern Hire ఇంటర్వ్యూ, మదింపు, మూల్యాంకనం, ఎంపిక లేదా నియామక ప్రక్రియలో పాల్గొనదు లేదా వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోదు. అభ్యర్థులు, రిక్రూటర్‌లు మరియు ఉద్యోగ యజమానులను ఈ నోటీసులో ఉమ్మడిగా “యూజర్‌లు” అని పేర్కొనవచ్చు.  మా సర్వీస్‌లలో భాగంగా, మేము మీ డేటాను ప్రాసెస్ చేస్తాము, ఇది మిమ్మల్ని ఒక యూజర్‌గా గుర్తించవచ్చు లేదా గుర్తించడంలో సహాయపడవచ్చు (ఇకపై అలాంటి గుర్తించదగిన వ్యక్తిగత డేటా “వ్యక్తిగత డేటా” అని పిలువబడుతుంది). ఈ నోటీసు కోసం మేము వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తున్నప్పుడు, వ్యక్తిగత డేటా, వ్యక్తిగత సమాచారం లేదా వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం అన్నీ వర్తించే చట్టం అధారంగా ఉపయోగించబడతాయని దయచేసి గుర్తుంచుకోండి. ఈ నోటీసు వ్యక్తిగత డేటా రకాలతో పాటు మేము దాన్ని ప్రాసెస్ చేసే ఉద్దేశాలను వివరిస్తుంది.

Modern Hire ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లో ఉంది మరియు దీనికి ప్రపంచవ్యాప్తంగా అనుబంధ సంస్థలు, క్లయింట్లు మరియు మూడవ పక్షం సర్వీస్ ప్రొవైడర్‌లు ఉన్నాయి. మా ప్రధాన అడ్రసు మరియు మా అనుబంధ సంస్థల స్థానాలు ఈ నోటీసు చివరిలో ఉన్నాయి.

మీరు మా సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు, మా వెబ్‌సైట్‌లను సందర్శించినప్పుడు మరియు మా సోషల్ మీడియా పేజీలను యాక్సెస్ చేసినప్పుడు మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా ఉపయోగిస్తామో ఈ నోటీసు వివరిస్తుంది. ఇది మీ వ్యక్తిగత డేటాకు సంబంధించి మీ హక్కులను కూడా వివరిస్తుంది. కింద “మీ హక్కులు” విభాగంలో మీ హక్కులు మరియు వాటిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మరింత సమాచారం ఇవ్వబడింది.

వ్యక్తిగత డేటా సేకరించడం మరియు ప్రాసెస్ చేయడం

మేము మీ వ్యక్తిగత డేటాను ఎలా అందుకుంటాము మరియు మీరు లేదా యజమాని దానిని ఏ ప్రయోజనాల కోసం అందిస్తారు అనే దానిపై ఆధారపడి, మేము మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే ప్రయోజనాలను మరియు మార్గాలను నిర్ణయించే డేటా కంట్రోలర్ (“కంట్రోలర్“) పాత్రలో ఉండవచ్చు లేదా మా క్లయింట్ల తరపున మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తూ, మేము డేటా ప్రాసెసర్ పాత్రలో (“ప్రాసెసర్“) ఉండవచ్చు (అంటే, కంట్రోలర్‌లు). మేము మీ వ్యక్తిగత డేటాకు సంబంధించి చాలా వరకు సమయంలో, మొత్తం కాకపోయినా, ప్రాసెసర్ పాత్రలో ఉంటామని మేము అంచనా వేస్తున్నాము.

ప్రోసెసర్‌గా Modern Hire

Modern Hire వ్యాపారం మా సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత డేటా ప్రాసెసర్‌గా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. అంటే మేము మా క్లయింట్‌ల తరపున (అంటే, ఉద్యోగ యజమానులు) పని చేస్తాము మరియు వారి సూచనల మేరకు మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము. మా క్లయింట్లు సాధారణంగా మేము ప్రాసెస్ చేసే వ్యక్తిగత డేటాకు కంట్రోలర్‌లుగా ఉంటారు. కంట్రోలర్‌గా, మా సర్వీస్‌ల ద్వారా పొందిన వ్యక్తిగత డేటా ఏ ప్రయోజనాల కోసం ప్రాసెస్ చేయబడుతుందో మా క్లయింట్ నిర్ణయిస్తారు మరియు మా ప్రాసెసింగ్‌ని అనుమతించే చట్టపరమైన ప్రాతిపదికను నిర్ణయించే బాధ్యత క్లయింట్‌కు ఉంటుంది. మా క్లయింట్ గోప్యతా ప్రకటనలలో వారి కార్యకలాపాల గురించి మరిన్ని వివరాలు ఉండవచ్చు. మేము పనిచేసే అధికార పరిధిని బట్టి, “ప్రాసెసర్” మరియు “కంట్రోలర్” అనే పదాలకు వేర్వేరు పేర్లు ఉండవచ్చు, కానీ పదాల వెనుక ఉన్న భావనలు స్థిరంగా ఉంటాయి. ఉదాహరణకు, ప్రాసెసర్‌ను కొన్ని నిబంధనల ప్రకారం “సర్వీస్ ప్రొవైడర్” లేదా ఇతర పదంతో సూచించవచ్చు మరియు కంట్రోలర్‌ను “బిజినెస్” లేదా ఇతర పదంతో సూచించవచ్చు. సరళత కోసం, మేము ఈ నోటీసు అంతటా ప్రాసెసర్/కంట్రోలర్ పదాలను ఉపయోగిస్తాము.

Modern Hire ఆరోగ్య సమాచారం, రాజకీయ అభిప్రాయాలు, మత విశ్వాసాలు, సామాజిక భద్రతా నంబర్లు, పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లు మరియు/లేదా ఆర్థిక సమాచారం వంటి సున్నిత రకాల డేటాను ప్రాసెస్ చేయడానికి ఉద్దేశించదు మరియు మా సర్వీస్‌లు ఈ రకం డేటా నిల్వ చేయడానికి ఉద్దేశించబడలేదు. Modern Hire సందర్భానుసారంగా యూజర్ లింగం, తెగ లేదా జాతికి సంబంధించిన సమాచారాన్ని ప్రాసెస్ చేయవచ్చు, ఆ ఫీచర్లు గ్రహించబడినా లేదా వీడియో ద్వారా ఊహించబడినా, కానీ అలాంటి ఫీచర్లు మా సర్వీస్‌లు ఎలా అందించబడతాయనే దానిలో ఎటువంటి పాత్రను పోషించవు. అదనంగా, మా సర్వీస్‌లు గుర్తింపుతో సహా ఏ ఉద్దేశానికైనా ముఖ లక్షణాలను, ముఖ కవళికలు, కంటి కదలికలు లేదా గొంతు స్వరాన్ని విశ్లేషించవు లేదా కొలవవు. మీరు సున్నితమైన డేటా ఉండే సమాచారాన్ని మా సర్వీస్‌లలోకి కూడా అప్‌లోడ్ చేయవచ్చు; మా సర్వీస్‌లలో భాగంగా ఈ సున్నితమైన డేటాను ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉందని మేము ఊహించడం లేదు.

రికార్డింగ్ (అంటే, వీడియో లేదా వాయిస్) ద్వారా పొందిన ఏదైనా సమాచారాన్ని అందించాలని మీరు ఎంచుకున్న సందర్భంలో, మేము గుర్తింపు ప్రయోజనాల కోసం అలాంటి రికార్డింగ్‌లను ఉపయోగించము (అంటే, అవి డిజిటల్‌గా విశ్లేషించబడవు లేదా వాయిస్‌ప్రింట్‌లు లేదా ముఖ గుర్తింపు ఫైల్‌లుగా ప్రాసెస్ చేయబడవు), కాబట్టి ఈ రికార్డింగ్‌లను కొన్ని చట్టాలలో నిర్వచించినట్లుగా లేదా వాటికి లోబడి బయోమెట్రిక్ డేటాగా పరిగణించము. అయినప్పటికీ, అదనపు డేటా గోప్యతా బాధ్యతల కోసం వర్తించే చట్టం ప్రకారం నిర్వచనానికి అనుగుణంగా లేనప్పటికీ, మేము మీ వ్యక్తిగత డేటాను గోప్యంగా పరిగణిస్తాము. కింది సంప్రదింపు సమాచారంతో మీ వ్యక్తిగత డేటా మరియు మా ప్రాసెసింగ్ గురించి మీకున్న ఏవైనా ప్రశ్నలతో మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.

కంట్రోలర్‌గా Modern Hire

మేము మా క్లయింట్‌లకు అందించే సర్వీస్‌లకు అదనంగా, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు లేదా మా సోషల్ మీడియా పేజీలతో ఇంటరాక్ట్ చేసినప్పుడు మేము కంట్రోలర్‌గా వ్యవహరిస్తాము. ఇది జరిగినప్పుడు, మేము ఈ కింది సమాచారాన్ని సేకరించవచ్చు:

  • IP అడ్రసు
  • కుకీ ID
  • వాడకం మరియు బ్రౌజర్ సమాచారం
  • మీరు ఇంటరాక్ట్ అయ్యే కంటెంట్

మీరు మా సర్వీస్‌ల కోసం డెమోని అభ్యర్థిస్తే, అప్పుడు మేము వీటిని కూడా సేకరిస్తాము:

  • మొదటి పేరు
  • చివరి పేరు
  • ఫోను నంబరు
  • ఇమెయిల్ అడ్రసు
  • విభాగం
  • కంపెనీ పేరు మరియు మీ కంపెనీ గురించి సమాచారం

Modern Hire వ్యక్తిగతం కాని మరియు/లేదా పేరులేని సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, దీన్ని సమగ్ర విధానంతో సహా ఏదైనా ప్రయోజనం కోసం ఉపయోగించే హక్కు మాకు ఉంది. ఉదాహరణకు, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయోజనాల కోసం, సమస్యలను నిర్ధారించడంలో సహాయపడటానికి, ట్రాఫిక్ ప్యాటర్న్‌లను పర్యవేక్షించడానికి, ఎక్కువగా ఏ సేవలను ఉపయోగించబడ్డాయో మరియు సైట్ వాడకాన్ని మదింపు చేయడానికి మేము సిస్టమ్-సంబంధిత సమాచారాన్ని సేకరించవచ్చు. డేటా పేరు లేకుండా చేయబడిన లేదా గుర్తించకుండా చేయబడిన చోట, అది మీకు ఇకపై గుర్తించదగినదిగా ఉండదు మరియు ఇకపై వ్యక్తిగత డేటా కాదు.

మూడవ పక్షాలు

మీరు మా సర్వీస్‌లను ఏవైనా కో-బ్రాండెడ్ వెబ్‌సైట్‌లు లేదా లింక్ చేయబడిన వెబ్ పేజీల ద్వారా యాక్సెస్ చేసినప్పుడు (ఉద్యోగ యజమాని లేదా మరోదాని ద్వారా), వర్తించే చోట మీ వ్యక్తిగత డేటా Modern Hire మరియు/లేదా సంబంధిత ఉద్యోగ యజమానికి వెల్లడించబడుతుంది. అలాంటి సందర్భంలో, ఉద్యోగ యజమాని ద్వారా అటువంటి వ్యక్తిగత డేటాను ఉపయోగించడం అనేది ఆ క్లయింట్ గోప్యతా విధానానికి లోబడి ఉంటుంది మరియు Modern Hire ఆ క్లయింట్ వ్యక్తిగత డేటా వినియోగానికి సంబంధించిన పాలసీకి బాధ్యత వహించదు లేదా దానికి లోబడి ఉండదు. ఆ ప్రకారంగా, ఏవరైనా సంబంధిత ఉద్యోగ యజమాని మరియు ఇతర మూడవ పక్షానికి మీరు ఏదైనా వ్యక్తిగత డేటాను సరఫరా చేసే ముందు వారి గోప్యతా విధానాలు మరియు ఆచరణలను సమీక్షించమని Modern Hire మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

మా సర్వీస్‌లకు మూడవ పక్షం సైట్‌లకు లింక్‌లు ఉండవచ్చు. ఈ లింక్‌లు మీ సౌలభ్యం కోసం మాత్రమే అందించబడ్డాయి మరియు మీరు లింక్ అయ్యే లేదా సర్వీస్‌ల నుండి లింక్ చేయబడే ఇతరుల సొంత సైట్‌ల గోప్యతా విధానాలు, ఆచరణలు లేదా కంటెంట్‌కు Modern Hire బాధ్యత వహించదు. ఆ సైట్‌లు మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తాయి, ఉపయోగిస్తాయి మరియు పంచుకుంటాయి అనేది అర్థం చేసుకోవడానికి, ఆ సైట్‌ల గోప్యతా విధానాలు మరియు నిబంధనలు మరియు షరతులను సమీక్షించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ నోటీసు మేము మా సర్వీస్‌ల నుండి సేకరించే సమాచారానికి మాత్రమే వర్తిస్తుంది.

ప్రాసెసింగ్ ఉద్దేశం మరియు చట్టపరమైన ఆధారం

Modern Hire కింది సేవలను అందించడానికి వినియోగదారు సమాచారాన్ని సేకరిస్తుంది:

ఒప్పందాన్ని నెరవేర్చడానికి లేదా కాంట్రాక్ట్‌కు లింక్ చేయబడిన చర్యలు తీసుకోవడానికి. సర్వీస్‌లను స్వీకరించడానికి మీరు మమ్మల్ని సంప్రదించే చోట ఇది సంబంధితంగా ఉంటుంది. ఇందులో ఇవి ఉంటాయి:

  • ఖాతాలను సెటప్ చేయడం.
  • మీ గుర్తింపును ధ్రువీకరించడం.
  • మీతో కమ్యూనికేట్ చేయడం.
  • కస్టమర్ సర్వీస్ అందించడం.

మా చట్టబద్ధమైన ప్రయోజనాలపై ఆధారపడటం

మేము కింద వివరించిన మా చట్టబద్ధమైన ప్రయోజనాలు లేదా మా క్లయింట్ల చట్టబద్ధమైన ప్రయోజనాల ఆధారంగా మేము నిర్వహించే అన్ని వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ కోసం బ్యాలెన్సింగ్ పరీక్షలను నిర్వహించాము. కింది సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీరు మా బ్యాలెన్సింగ్ పరీక్షల్లో దేని గురించి అయినా సమాచారాన్ని పొందవచ్చు.

మా వ్యాపారాన్ని నిర్వహించడానికి మరియు మా చట్టబద్ధమైన ప్రయోజనాలను కొనసాగించడానికి Modern Hire కు అవసరమైన విధంగా, ప్రత్యేకించి:

  • యూజర్‌లకు సహాయకరంగా ఉండవచ్చని Modern Hire విశ్వసించే సమాచారాన్ని పంపడం.
  • ఎప్పటికప్పుడు, అప్లికేషన్ పరిశోధన ప్రయోజనాల కోసం యూజర్ల‌లను సంప్రదించడం.
  • సర్వీస్‌లను అనుకూలీకరించడం.
  • మా వెబ్‌సైట్‌లు మరియు ఆన్‌లైన్ సేవల వాడకాన్ని పర్యవేక్షించడం మరియు మా ఉత్పత్తులను మెరుగుపరచడం.
  • మీరు అభ్యర్థించిన ఉత్పత్తులు మరియు సర్వీస్‌లు అందించడం.
  • మీరు మాకు పంపే ఏవైనా కామెంట్లు లేదా ఫిర్యాదులకు ప్రతిస్పందించడం.
  • చట్టపరమైన క్లెయిమ్‌లు, పాటింపు, రెగ్యులేటరీ మరియు పరిశోధనాత్మక ప్రయోజనాలకు సంబంధించి మరియు చట్టం ప్రకారం అవసరమైన విధంగా వ్యక్తిగత డేటాను ఉపయోగించడం.

మీ సమ్మతిపై ఆధారపడటం

మీరు మాకు సమ్మతి ఇచ్చిన చోట:

  • మా సంబంధిత ఉత్పత్తులు మరియు సర్వీస్‌లు లేదా మేము, మా అనుబంధ సంస్థలు మరియు జాగ్రత్తగా ఎంచుకున్న భాగస్వాములు అందించే ఇతర ఉత్పత్తులు మరియు సర్వోస్‌లకు సంబంధించి మేము మీకు ప్రత్యక్ష మార్కెటింగ్‌ను పంపుతాము.
  • “కుక్కీలు, బీకాన్‌లు; ట్రాకింగ్ టెక్నాలజీ” అనే శీర్షికతో కింది విభాగానికి అనుగుణంగా మేము కుక్కీలు ఉంచుతాము మరియు సారూప్య సాంకేతికతలను మరియు ఆ సాంకేతికతలను ఉపయోగించినప్పుడు మీకు అందించబడిన సమాచారం ఉపయోగిస్తాము.
  • మేము మిమ్మల్ని సమ్మతి అడిగే ఇతర సందర్భాల్లో, మేము ఆ సమయంలో వివరించే ప్రయోజనం కోసం మీ వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తాము.

చట్టం ద్వారా అవసరమైన ప్రయోజనాల కోసం:

  • విచారణను నిర్వహిస్తున్న ప్రభుత్వం లేదా చట్ట అమలు అధికారుల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత డేటాను అవసరమైన విధంగా ఉపయోగించుకునే హక్కు మాకు ఉంది.

మీ సమ్మతిని ఉపసంహరించుకోవడం; డైరెక్ట్ మార్కెటింగ్‌కి అభ్యంతరం చేయడం

మేము మీ సమ్మతిపై ఆధారపడే ప్రతిచోటా, ఆ సమ్మతిని ఉపసంహరించుకునే హక్కు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. అటువంటి ఉపసంహరణ ఏదైనా భవిష్యత్ లేదా నిరంతర ఉపయోగం కోసం గౌరవించబడుతుందని దయచేసి గమనించండి, అయితే పైన పేర్కొన్న వాటి కంటే ఇతర ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి మరియు/లేదా నిలిపి ఉంచుకోవడానికి మాకు ఇతర చట్టపరమైన ప్రాతిపదికలు ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో, మీ సమ్మతి లేకుండా మీకు డైరెక్ట్ మార్కెటింగ్‌ను పంపడానికి మేము ఎంచుకోవచ్చు, ఉదాహరణకు, మేము మా చట్టబద్ధమైన ప్రయోజనాలపై ఆధారపడే చోట. మీకు ఎప్పుడైనా డైరెక్ట్ మార్కెటింగ్‌ని నిలిపివేయడానికి హక్కు ఉంది. ఇది ఎలక్ట్రానిక్ సందేశం అయినచోట కమ్యూనికేషన్‌లోని సూచనలను అనుసరించడం ద్వారా లేదా కింది సంప్రదింపు సమాచారంలో మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు.

సమాచారం వెల్లడించడం మరియు పంచుకోవడం

చట్టం ద్వారా అధికారం ఉన్న చోట మరియు మీరు నిలిపివేయాలని ఎంచుకుంటే తప్ప, మేము మా సర్వీస్‌ల మార్కెటింగ్, కమ్యూనికేషన్ మరియు సౌలభ్యత కోసం Modern Hire అనుబంధ గ్రూప్ కంపెనీలతో మీ వ్యక్తిగత డేటాను పంచుకోవచ్చు.

Modern Hire మీ వ్యక్తిగత డేటాను క్రింది పద్ధతులలో పంచుకుంటుంది:

  • మీరు అభ్యర్థి అయితే – ఉద్యోగ యజమాని మరియు రిక్రూటర్‌తో.
  • మీరు రిక్రూటర్ అయితే – ఉద్యోగ యజమానితో.
  • మీరు ఉద్యోగ యజమాని అయితే – మా సర్వీస్‌లు అందించడానికి, రిక్రూటర్‌తో.

కొందరు మూడవ పక్ష సర్వీస్ ప్రొవైడర్లతో వ్యక్తిగత డేటా కూడా పంచుకోబడుతుంది, వారు పైన గుర్తించిన ప్రయోజనాల కోసం Modern Hire తరపున ప్రాసెస్ చేస్తారు. ప్రత్యేకించి, మేము ఇతర ప్రయోజనాలతోపాటు, వెబ్‌సైట్ హోస్టింగ్, నిర్వహణ మరియు ఆడియో/విజువల్ ప్రాసెసింగ్ కోసం నిర్దిష్ట మూడవ పక్ష సర్వీస్ ప్రొవైడర్లను ఉపయోగిస్తాము.

మా తరపున మేము అటువంటి మూడవ పక్ష సర్వీస్ ప్రొవైడర్లను పాలుపంచుకునేలా చేసే చోట, మేము మీ వ్యక్తిగత డేటాను రక్షించడానికి తగిన ఒప్పందాలను కుదుర్చుకున్నామని ధ్రువీకరించుకుంటాము. Modern Hire కు అనుబంధంగా ఉన్న బిజినెస్‌లు, విభాగాలు మరియు యూనిట్‌లకు కూడా Modern Hire వ్యక్తిగత డేటా మరియు/లేదా పేరులేని సమగ్ర సమాచారాన్ని వెల్లడించవచ్చు.

ఒక Modern Hire బిజినెస్ లైన్ లేదా మొత్తం బిజినెస్ లేదా దానిలోని గణనీయమైన భాగం, విలీనం, ఏకీకరణ లేదా ఆస్తులలో గణనీయమైన భాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా కొనుగోలు లేదా బదిలీ చేస్తే, Modern Hire మీ వ్యక్తిగత డేటాను సొంతం చేసుకున్న సంస్థకు వెల్లడించవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. చిత్తశుద్ధితో మరియు మా సొంత విచక్షణ ప్రకారం, (ఎ) సర్వీస్‌ల నిబంధనలు మరియు షరతులను అమలు చేయడానికి లేదా వర్తింపజేయడానికి; (బి) చట్టపరమైన లేదా నియంత్రణ అవసరాలను పాటించడానికి; (సి) మా, మా యూజర్లు లేదా ఇతర మూడవ పక్షాల హక్కులు, ఆస్తి లేదా భద్రతను రక్షించడానికి; లేదా (డి) నేరాన్ని నిరోధించడానికి లేదా జాతీయ భద్రతను రక్షించడానికి అలాంటి వెల్లడి సహేతుకంగా అవసరమని మేము నమ్మినప్పుడు, Modern Hire మీ వ్యక్తిగత డేటాను మూడవ పక్షాలకు వెళ్లడించవచ్చు. క్లయింట్లు, వ్యాపార భాగస్వాములు, మూడవ పక్షం సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనదారులు, పెట్టుబడిదారులు, సంభావ్య కొనుగోలుదారులు మరియు ఇతర మూడవ పార్టీలతో సహా మా సొంత విచక్షణ ప్రకారం మేము ఎంచుకున్నట్లుగా Modern Hire పేరులేని మరియు/లేదా సమగ్ర సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు మరియు/లేదా వెల్లడించవచ్చు.

సమాచారం నిలుపుదల

Modern Hire మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయబడిన ప్రయోజనాలను నెరవేర్చడానికి అవసరమైన దానికంటే ఎక్కువ కాలం నిలిపి ఉంచదు, అటువంటి ప్రయోజనం ఒప్పందం ద్వారా నిర్దేశించబడినా లేదా వర్తించే చట్టం లేదా నిబంధనల ప్రకారం అవసమైనా. ప్రాసెసర్‌గా వ్యవహరిస్తున్నప్పుడు, Modern Hire మరియు ఉద్యోగ యజమాని మధ్య ఒప్పందం ద్వారా అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్ ఏర్పాటు చేయబడుతుంది.

మేము మీ రిజిస్ట్రేషన్ డేటాను ప్రాసెస్ చేసే చోట, మీరు మా సర్వీస్‌ల సక్రియ యూజర్‌గా ఉన్నంత వరకు మరియు ఆ తర్వాత మా రికార్డ్ నిలుపుదల విధానాలకు అనుగుణంగా మేము దీన్ని చేస్తాము.

మేము మార్కెటింగ్ ప్రయోజనాల కోసం లేదా మీ సమ్మతితో వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసే చోట, మీరు మీ సమ్మతిని ఉపసంహరించుకునేంత వరకు లేదా మేము ఆపివేయమని (ఉదాహరణకు, తదుపరి మార్కెటింగ్ ప్రయోజనాల కోసం) అభ్యర్థించేంత వరకు అటువంటి వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి మాకు హక్కు ఉంటుంది. చట్టం ప్రకారం మాకు అవసరమైన లేదా అనుమతించబడిన చోట, మీకు ప్రత్యక్ష మార్కెటింగ్‌ను పంపవద్దని లేదా మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయవద్దని మీరు మమ్మల్ని కోరిన వాస్తవాన్ని కూడా మేము రికార్డ్ చేస్తాము, తద్వారా మేము భవిష్యత్తులో మీ అభ్యర్థనను గౌరవిస్తాము.

మీ హక్కులు

మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేదాన్నిబట్టి, మీ వ్యక్తిగత డేటాకు సంబంధించిన నిర్దిష్ట హక్కులు మీకు ఉండవచ్చు, ఉదాహరణకు:

  • మీ వ్యక్తిగత డేటా మా ప్రాసెసింగ్ గురించి తెలియజేయబడటానికి హక్కు;
  • మీ వ్యక్తిగత డేటా కాపీని యాక్సెస్ చేయడానికి;
  • మీ వ్యక్తిగత డేటాను సరిదిద్దమని అభ్యర్థించడానికి;
  • మీ వ్యక్తిగత డేటా బదిలీని అభ్యర్థించడానికి;
  • మీ వ్యక్తిగత డేటాను మేము ప్రాసెసింగ్ చేయడాన్ని పరిమితపరచడానికి లేదా అభ్యంతపరచడానికి; మరియు
  • మీ వ్యక్తిగత డేటాను తొలగించమని అభ్యర్థించడానికి.

వర్తిస్తే, ఆటోమేట్ చేయబడిన నిర్ణయం తీసుకోవడంపై అభ్యంతరం చెప్పే హక్కు కూడా మీకు ఉండవచ్చు.

కింది సంప్రదింపు సమాచారంలో మమ్మల్ని సంప్రదించడం ద్వారా మీకు ఉండవచ్చని మీరు విశ్వసించే ఏవైనా హక్కులను మీరు అభ్యర్థించవచ్చు (దేశానికి సంబంధించిన నిర్దిష్ట చట్ట అనుబంధాన్ని కూడా చూడండి).

మీ వ్యక్తిగత డేటాకు ఉల్లంఘన జరిగిందని మీరు విశ్వసిస్తే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా మీరు నివసిస్తున్న, పని చేసే లేదా మీ వ్యక్తిగత డేటా ఉల్లంఘన జరిగిందని విశ్వసించే దేశంలోని రెగ్యులేటరీ అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు.

దయచేసి కింది సంప్రదింపు సమాచారానికి అనుగుణంగా మాకు ఏదైనా అభ్యర్థనను దయచేసి పంపండి.

మీ వ్యక్తిగత డేటాను మేము ఎవరికీ విక్రయించము మరియు మా సర్వీస్‌లను అందించడానికి మరియు వర్తించే చట్టం ద్వారా అనుమతించబడినప్పుడు తప్ప మేము దానిని ఎవరితోనూ పంచుకోము లేదా బదిలీ చేయము.

మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి సంబంధించి మీకున్న ఏవైనా ఆందోళనలు లేదా సమస్యలను చర్చించడానికి కింది సంప్రదింపు సమాచారంలో పేర్కొన్న అడ్రసులో మమ్మల్ని సంప్రదించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

డేటా భద్రత

వ్యక్తిగత డేటా అనుకోకుండా కోల్పోకుండా, ఉపయోగించబడకుండా లేదా అనధికార పద్ధతిలో యాక్సెస్ చేయబడకుండా నిరోధించడానికి Modern Hire తగిన సాంకేతిక మరియు సంస్థాగత చర్యలను ఏర్పాటు చేసింది. సముచితమైన చోట, డేటా రక్షణ చర్యలను మరింత నిర్దిష్టంగా వివరించడానికి మా క్లయింట్లు మరియు మూడవ పక్ష సర్వీస్ ప్రొవైడర్లతో మేము డేటా రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నాము. మేము ISO 27001 ధ్రువీకరించిన మరియు SOC2 టైప్ 2 పాటించేవారిమి. భద్రత పట్ల మా నిబద్ధత గురించి అదనపు సమాచారాన్ని https://modernhire.com/platform/data-security/

కుకీలు; బీకాన్స్; ట్రాకింగ్ టెక్నాలజీ

యూజర్ల సౌలభ్యం కోసం మరియు సర్వీస్‌లను ఉపయోగించి వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి Modern Hire “కుకీలు,” “వెబ్ బీకాన్‌లు” మరియు సారూప్య సాంకేతికతను ఉపయోగిస్తుంది. కుకీ అనేది సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు మీరు మాటిమాటికి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా మేమ మిమ్మల్ని గుర్తించగలిగేలా చేయడానికి వాడకం ఆధారంగా వెబ్ పేజీ సర్వర్ ద్వారా తాత్కాలికంగా లేదా నిరంతరంగా హార్డ్ డ్రైవ్‌లో రికార్డ్ చేయబడే చిన్న టెక్స్ట్ ఫైల్. వెబ్ బీకాన్‌లు అనేవి వీక్షించిన పేజీలు లేదా తెరిచిన సందేశాల వంటి వెబ్ లాగ్ సమాచారాన్ని సేకరించేందుకు రూపొందించబడిన గ్రాఫిక్స్. కుక్కీలు, వెబ్ బీకాన్‌లు మరియు సారూప్య సాంకేతికతపై ఆధారపడటం ద్వారా, Modern Hire ప్రతి యూజర్‌కు మరింత వ్యక్తిగతీకరించిన మరింత సమర్థవంతమైన సర్వీస్‌ను అందించగలదు. అదనంగా, ఈ సాంకేతికతలు సర్వీస్‌లను మరింత ఉపయోగకరంగా చేయడానికి ట్రాఫిక్ విధాలను, సర్వీస్‌ల వినియోగాన్ని మరియు సెషన్ సమాచారాన్ని పర్యవేక్షించడానికి Modern Hire కు వీలుకల్పించవచ్చు.

Modern Hire కింది ప్రయోజనాల కోసం కింది కుకీలను ఉపయోగిస్తుంది:

కుకీ కేటగిరీలు
అవసరమైన కుకీలు. వెబ్‌సైట్ పని చేయడానికి ఈ కుకీలు అవసరం.
అనలైటిక్స్ కుకీలు. ఈ కుకీలు మా వెబ్‌సైట్ వాడకాన్ని విశ్లేషించడానికి మాకు సహాయపడతాయి, తద్వారా మేము మా సర్వీస్‌లను మెరుగుపరుస్తాము.

 

కార్యాచరణకు సంబంధించిన కుకీలు. ఈ కుకీలు మీరు చేసే ఎంపికలను (మీ భాష లేదా మీరు ఉన్న ప్రాంతం వంటివి) గుర్తుంచుకోవడానికి మరియు మెరుగుపరచబడిన, మరిన్ని వ్యక్తిగత ఫీచర్లను అందించడానికి మాకు వీలుకల్పిస్తాయి.

అదనపు చట్టాలు; మార్పులు

పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ నియమం (“COPPA”)

మేము 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న యూజర్ల నుండి వ్యక్తిగత డేటాను తెలిసి లేదా ప్రత్యేకంగా సేకరించము. ఈ సర్వీస్‌లను ఉపయోగించడానికి మేము 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యూజర్లకు అధికారం ఇవ్వము. మా సేవలను 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు ఉపయోగిస్తున్నారని మీరు విశ్వసిస్తే దయచేసి మాకు తెలియజేయండి.

మార్పులు

ఈ నోటీసును ఏ సమయంలోనైనా మార్చే హక్కును Modern Hire సురక్షితం చేసుకున్నది. ప్రత్యేకించి, మేము సమాచారాన్ని సేకరించే, ఉపయోగించే లేదా వెల్లడించే విధానంలో మార్పులను ప్రతిబింబించేలా లేదా గోప్యతా చట్టాలు, నిబంధనలు మరియు/లేదా పరిశ్రమ ప్రమాణాలలో మార్పులను ప్రతిబింబించేలా ఈ నోటీసును మేము సవరించవచ్చు. సర్వీస్‌లను యాక్సెస్ చేస్తున్నప్పుడు ఈ నోటీసును సమీక్షించమని మేము యూజర్లను ప్రోత్సహిస్తాము. మేము మీ డేటాను నిర్వహించే విధానాన్ని మార్పులు గణనీయంగా ప్రభావితం చేసే చోట, మేము వాటిని మీ దృష్టికి తీసుకువస్తాము.

మీ వ్యక్తిగత డేటా బదిలీ

Modern Hire మీ వ్యక్తిగత డేటాను ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేసినప్పుడు, Modern Hire మీ సమాచారం కనీసం మూల దేశంలో అవసరమయ్యే ప్రమాణాల ప్రకారం రక్షించబడిందని ధ్రువీకరించుకుంటుంది. ఉదాహరణకు, డేటా బదిలీని కవర్ చేసే తగిన చట్టపరమైన ఒప్పందం ఉందని మేము ధ్రువీకరించుకుంటాము.  వర్తించే చట్టం ప్రకారం అలా చేయటం అవసరమైనప్పుడు మేము వ్యక్తిగత డేటాను ఒక దేశం నుండి మరొక దేశానికి బదిలీ చేయడానికి సంబంధించి అదనపు నిర్దిష్ట చర్యలు తీసుకుంటాము; ఉదాహరణకు, దేశం-నిర్దిష్ట చట్ట అనుబంధాన్ని చూడండి.

దేశం నిర్దిష్ట చట్ట అనుబంధం

మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనేదాన్నిబట్టి, మా గోప్యతా నోటీసులో పేర్కొన్న నిబంధనలతో పాటు కింది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దేశ (మరియు/లేదా ప్రాంతం మరియు/లేదా రాష్ట్రం) నిర్దిష్ట చట్ట అనుబంధాలు మీకు వర్తించవచ్చు. దేశ నిర్దిష్ట చట్ట అనుబంధంలో నిర్వచించబడని పెద్ద అక్షరాలలో ఉన్న పదాలు గోప్యతా నోటీసులో పేర్కొన్న అలాంటి పదాల అదే అర్థాలను కలిగి ఉంటాయి.

దయచేసి మీరు నివసిస్తున్న ప్రదేశ చట్టాన్ని బట్టి మీకు వర్తించే అదనపు పరిశీలనల కోసం దేశ నిర్దిష్ట చట్ట అనుబంధాన్ని సమీక్షించండి.

యునైటెడ్ స్టేట్స్ అనుబంధం

ఇల్లినాయిస్ నివాసితుల కోసం

          EU/EEA అనుబంధం

          యునైటెడ్ కింగ్‌డమ్ అనుబంధం

          కెనడా అనుబంధం

          ఆస్ట్రేలియా అనుబంధం

        మలేషియా అనుబంధం

సంప్రదింపు సమాచారం

సాంకేతిక ప్రశ్నల కోసం, దయచేసి

మీ హక్కులను వినియోగించుకోవడానికి, మా గోప్యతా ఆచరణలను గురించి ప్రశ్నలు అడగడానికి లేదా ఫిర్యాదు సమర్పించడానికి, దయచేసి మమ్మల్ని ఇక్కడ సంప్రదించండి:

Modern Hire, Inc.

3201 Enterprise Parkway, Ste 460

Cleveland, Ohio 44122

ఇమెయిల్:

 

అనుబంధ సంస్థలు మరియు సంప్రదింపు సమాచారం

యునైటెడ్ స్టేట్స్

Modern Hire, Inc.

3201 Enterprise Parkway, Ste 460

Cleveland, Ohio 44122

యుఎస్ఏ

టెలి: (877) 451-1659

info@modernhire.com

యూరోపు

Modern Hire Europe Limited

europe@modernhire.com

ఆసియా పసిఫిక్

Modern Hire Asia Pacific Pte Ltd.

asiapacific@modernhire.com

ఆస్ట్రేలియా

Modern Hire Australia Pty Ltd.

australia@modernhire.com

యునైటెడ్ కింగ్‌డమ్

Modern Hire UK Limited

uk@modernhire.com

ఫ్రాన్స్

Modern Hire France SAS

europe@modernhire.com